: మాలీలోని హోటల్ పై ఉగ్రవాదుల దాడి... ఏడుగురు దుర్మరణం

మాలీ దేశ రాజధాని బొమాకో నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న సివారి పట్టణంలోని బైబ్లాన్ హోటల్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. ఇస్లామిక్ తీవ్రవాదులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని సమాచారం. ఐక్యరాజ్యసమితికి చెందిన సిబ్బంది ఆ హోటల్ లో ఉన్నట్టు తెలుస్తోంది. హోటల్ ఆవరణలో మూడు మృతదేహాలు పడి ఉన్నాయి.

More Telugu News