: మోదీ వచ్చినప్పుడు కోహినూర్ వజ్రాన్ని ఇచ్చేయండి: బ్రిటన్ ప్రధానికి ఎంపీ కీత్ వాజ్ విజ్ఞప్తి

బ్రిటన్ లోని భారతీయ సమాజం చారిత్రాత్మక కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్ కు అప్పగించాలన్న డిమాండ్ ను మరోసారి తెరపైకి తెచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబరులో బ్రిటన్ పర్యటనకు వచ్చిన సమయంలోనే కోహినూర్ డైమండ్ ను ఆయనకు అప్పగించాలని భారత సంతతి ఎంపీ కీత్ వాజ్ ప్రధాని డేవిడ్ కామెరాన్ కు విజ్ఞప్తి చేశారు. ఆ అపురూపమైన వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని కీత్ వాజ్ నొక్కి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... "కోహినూర్ ను తిరిగి ఇచ్చేయడం ఎందుకు సాధ్యం కాదు? ఈ ప్రభుత్వం భారత్ తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటోంది. భారత్ నుంచి కోహినూర్ ను తీసుకురావడమన్నది వలస పాలన సమయంలో చోటుచేసుకున్న అనేక ఘటనల్లో ఒకటి. దాన్ని తిరిగివ్వడం ద్వారా కొన్ని తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు మా ముందు ఉంది" అని పేర్కొన్నారు.

More Telugu News