: ఏలియన్ అన్వేషణలో భారత్ సాయం కోరుతున్న రష్యా కుబేరుడు


ఈ అనంత విశ్వంలో ఎక్కడో ఓ చోట గ్రహాంతర వాసులు (ఏలియన్లు) ఉండే ఉంటారన్నది ఖగోళ శాస్త్రవేత్తల నమ్మిక. వారి నమ్మకమే ఆలంబనగా రష్యా కుబేరుడు యూరీ మిల్నర్ ఏలియన్ అన్వేషణకు ఉపక్రమించారు. భౌతికశాస్త్ర దిగ్గజం స్టీఫెన్ హాకింగ్ మద్దతుతో రంగంలోకి దిగిన మిల్నర్ ఇటీవలే 100 మిలియన్ డాలర్లతో 'బ్రేక్ త్రూ లిజన్' అనే ప్రాజెక్టును ప్రకటించారు. ఆ ప్రాజెక్టుకు భారత్ కూడా సాయం చేయాలంటున్నారు మిల్నర్. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఈ రష్యా బిజినెస్ టైకూన్ బెంగళూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు భారత సైంటిస్టులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు కూడా సహకరించాలని కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా సేకరించిన సమాచారం ప్రజలకు వెల్లడిస్తామని తెలిపారు. "డేటా అంతా ప్రజలకు నివేదిస్తాం. యూజర్లు ఓ ప్రత్యేక ప్లాట్ ఫాం ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చు" అని వివరించారు.

  • Loading...

More Telugu News