: 'కాంగ్రెస్ అబ్బాయిలు' ఇలాగేనా ప్రవర్తించేది?: స్మృతీ ఇరానీ మండిపాటు

కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు వ్యతిరేకంగా చొక్కాలు విప్పి నిరసన తెలపడంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మండిపడ్డారు. "లోక్ సభ స్పీకర్ పార్లమెంటుకు గర్వకారణం. అలాంటి వ్యక్తిని నిరసిస్తూ కాంగ్రెస్ అబ్బాయిలు చొక్కాలు విప్పడం సమంజసమేనా? వారు పాటించే విలువలు ఇవేనా ? మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా? రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపదేశిస్తోంది ఇదేనా ఏంటి? ఇదేనా వారి (కాంగ్రెస్) సంస్కృతి? చొక్కాలు విప్పి నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు?" అని దుయ్యబట్టారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారంటూ 25 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే. స్పీకర్ నిర్ణయంపై కాంగ్రెస్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది.

More Telugu News