: నేను కూడా బంగారు తెలంగాణ కోసం పనిచేస్తా: మాజీ క్రికెటర్ అజారుద్దీన్

తాను కూడా బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానని ప్రముఖ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అయిన అజారుద్దీన్ నేడు తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా, మాటల మధ్యలో తెలంగాణలో పెట్టుబడుల కోసం తాను కూడా యత్నిస్తానని చెప్పారు. తన మిత్రులు కొంత మంది మహారాష్ట్ర, కర్ణాటకలో పెట్టుబడులు పెడుతుంటే... తెలంగాణలో పెట్టాలని సూచించానని చెప్పారు. పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ మంచి అనువైన ప్రాంతమని అన్నారు.

More Telugu News