: టీడీపీ, బీజేపీలు ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నాయి: రఘువీరారెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని చెప్పడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే అవుతుందని చెప్పారు. కేబినెట్ నిర్ణయం ద్వారా ప్రత్యేక హోదాను ఇవ్వవచ్చని తెలిపారు. కేవలం అవినీతి సొమ్ము కోసమే పట్టిసీమ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం చేపట్టిందని రఘువీరా ఆరోపించారు. 2019 నాటికి పోలవరం పూర్తి కాకపోతే టీడీపీ దోషిగా మిగిలిపోతుందని చెప్పారు. టీడీపీ, బీజేపీ నేతల బండారాన్ని బయటపెట్టేందుకు తిరుపతిలో ప్రత్యేక హోదా అంశంపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.

More Telugu News