: వెంకయ్యనాయుడు తీరు అభ్యంతరకరంగా ఉంది: టీఆర్ఎస్ ఎంపీ కవిత

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై టీఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శలు గుప్పించారు. లోక్ సభలో ఆయన ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. అధికారపక్షం ఎక్కువ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హైకోర్టు విభజనపై కేంద్రం ప్రకటన చేసిన నేపథ్యంలో, హైకోర్టు తీర్పు వచ్చే వరకు తమ ఆందోళనలను విరమించుకుంటున్నామని చెప్పారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడమని తెలిపారు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన కోసమే కమిటీ వేశారని... కింద స్థాయి ఉద్యోగుల విభజనపై ఎలాంటి మార్గదర్శకాలు లేవని... దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఉద్యోగుల విభజన అంశంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలుస్తామని చెప్పారు.

More Telugu News