: కడప గడపలో బైరెడ్డి దీక్ష... సీమ కోసం ఢిల్లీలో గళమెత్తుతానని ప్రకటన

రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట వేరు కుంపటి పెట్టుకున్న టీడీపీ మాజీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కడప గడప తొక్కారు. రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఆందోళనలకు తెరతీసిన బైరెడ్డి నిన్న తన సొంత జిల్లా కర్నూలులో దీక్ష చేపట్టారు. నేడు కడప కలెక్టరేట్ ముందు ఆయన దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ కరవుసీమగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు తక్షణమే స్పందించకుంటే తాగడానికి కూడా చుక్క నీరుండదన్నారు. రాయలసీమ దుర్భిక్షంపై త్వరలో ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.

More Telugu News