: కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ పై బాధపడుతున్న బీజేపీ నేత

లోక్ సభ నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేయడంపై బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో చోటుచేసుకున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయంటూ ఈ సీనియర్ నటుడు ట్వీట్ చేశారు. మిత్రులు సభ నుంచి సస్పెండ్ అయ్యారన్న వార్త దురదృష్టకరమని పేర్కొన్నారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పాతికమంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం తెలిసిందే. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టడంతో సభలో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో స్పీకర్ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News