: తిరుపతిలో జడలు విప్పిన ర్యాగింగ్ భూతం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాగింగ్ నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. మరోపక్క అదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రైవేటు కళాశాలల్లో ర్యాగింగ్ భూతం జడలు విప్పుతోంది. కళాశాలల్లో జూనియర్లు, సీనియర్ల మధ్య సత్సంబంధాలు పెంచాల్సిన ర్యాగింగ్, వారి మధ్య శత్రుత్వం పెంచుతోంది. వివాదాలకు కారణమవుతోంది. తిరుపతిలోని టీటీడీ అనుబంధ కళాశాల శ్రీ గోవిందస్వామి (ఎస్ జీఎస్) ఆర్ట్స్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. కళాశాలలో సీనియర్ విద్యార్థులు ఓ జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ పేరిట చిత్రహింసలకు గురి చేశారని జూనియర్లు ఆరోపిస్తున్నారు. విషయం బయటకు పొక్కకుండా కళాశాల యాజమాన్యం అడ్డుకుంటోందని, నాగార్జునా యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థిని బలైనా సీనియర్ల ఆగడాలు ఆగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News