: తలుపులు మూసి కెమెరాలు ఆపి విభజన చేసినప్పుడు బ్లాక్ డే కాదా?... సోనియాను ప్రశ్నించిన జేసీ
కాంగ్రెస్ కు చెందిన 25 మంది ఎంపీలను లోక్ సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని బ్లాక్ డేగా అభివర్ణించిన ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 'ఈ రోజు బ్లాక్ డే' అని సోనియా అనటంలో అర్థమే లేదని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జేసీ అన్నారు. తలుపులు మూసి... కెమెరాలు ఆపి విభజన చేసినప్పుడు బ్లాక్ డే కాదా? అని సోనియాను సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో సోనియా పెడబొబ్బలు పెట్టడంలో అర్థం లేదన్నారు. ఆమెవల్లే కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చుందని, ఆమే కాంగ్రెస్ కు శాశ్వత సమాధి కట్టారని జేసీ వ్యాఖ్యానించారు.