: రిషితేశ్వరి మృతిపై త్వరలో సమగ్ర నివేదిక అందిస్తాం: విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం

గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి మరణంపై త్వరలోనే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా కొంత సమాచారాన్ని సేకరించామని చెప్పారు. విద్యార్థుల వద్ద సమాచారం ఉంటే తమకు తెలపాలని కోరుతున్నామన్నారు. ఈరోజు వర్సిటీలో ఆయన నేతృత్వంలో అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఉపకులపతి, రిజిస్టార్ తో ఏర్పాటైన కమిటి విచారణ చేస్తోంది.

More Telugu News