: చంద్రబాబు సర్కారుపై శివాజీ ఘాటు వ్యాఖ్యలు... లంచాలు పెచ్చరిల్లాయని ఆరోపణ

ఏపీకి ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు, సినీ హీరో శివాజీ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఏపీలో అవినీతి పెచ్చరిల్లుతోందని ఆరోపించారు. ఏపీలో సొంత రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తే లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు. సొంత రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు లంచాలెందుకివ్వాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన ఆరోపించారు. ఇక అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీపైనా ఆయన నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రెండు పార్టీల ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో హోదా కోసం చేస్తున్న ఆందోళనల్లో చిత్తశుద్ధిగా పాలుపంచుకుంటున్నారా? అని ఆయన నిలదీశారు.

More Telugu News