: సుష్మా స్వరాజ్ దేశానికి పెద్ద ఆస్తి: వెంకయ్యనాయుడు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, సీఎంల రాజీనామాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరోసారి స్పష్టమైన వైఖరిని తెలియజేశారు. కేంద్ర మంత్రులు, సీఎంలు ఎటువంటి తప్పు చేయలేదని, అలాంటప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దేశానికే పెద్ద ఆస్తి అని వెంకయ్య పేర్కొన్నారు. అయితే అన్ని అంశాలపై చర్చిస్తామన్నా లోక్ సభను సజావుగా జరగనివ్వటం లేదని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు కాంగ్రెస్ కు కంటగింపుగా ఉందని ఢిల్లీలో వ్యాఖ్యానించారు. పంచతంత్ర పేరుతో ఐదు పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లబోతున్నామని వెంకయ్య తెలిపారు.