: మామూలుగా నేను చాలా మెతక, తల్లి అయినా ఒక్కోసారి కఠినంగా ఉండాలిగా?: సుమిత్రా మహాజన్

లోక్ సభ కార్యకలాపాలను పదేపదే అడ్డుకుంటున్న 25 మంది ఎంపీలను, స్పీకర్ సుమిత్రా మహాజన్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తీసుకున్న కఠిన నిర్ణయంపై ఓ వైపు దుమారం జరుగుతుండగా, మరోవైపు తన చర్యలను సుమిత్ర సమర్థించుకున్నారు. తాను చాలా సౌమ్యురాలినని, అయితే, ఎంత మెతకగా వ్యవహరించే తల్లయినా కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సి వస్తుందని అన్నారు. ఓ పుస్తకావిష్కరణ సభలో ప్రసంగించిన ఆమె, తల్లి మరీ మెతకగా ఉంటే, పిల్లలు క్రమశిక్షణ తప్పుతారని అన్నారు. కాగా, 16వ లోక్ సభలో ఒకేసారి ఇంతమందిని సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి.

More Telugu News