: కేసీఆర్ ను కలవనీయలేదని మహిళ ఆత్మహత్యాయత్నం

తన సమస్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పుకునేందుకు వచ్చిన ఓ మహిళ, అందుకు అవకాశం దొరక్కపోవడంతో నిరాశతో ఆత్మహత్యాయత్నం చేసింది. సోమవారం నాడు హైదరాబాదులోని సచివాలయం వద్ద కలకలం రేపిన ఈ ఘటన వివరాలను పోలీసులు తెలిపారు. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలిసేందుకు అర్చన అనే మహిళ వచ్చింది. ఆమె సచివాలయం లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించ లేదు. దీంతో నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

More Telugu News