: టి20 క్రికెట్ ఎలాంటిదో ఐపీటీఎల్ కూడా అలాంటిదే: మహేశ్ భూపతి

ఓపెన్ టోర్నీలు, గ్రాండ్ స్లామ్ టోర్నీలకే పరిమితమైన టెన్నిస్ క్రీడను ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) పేరుతో కొత్తపుంతలు తొక్కించాడు భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి. పేరుమోసిన క్రీడాకారులను ఈ లీగ్ లో ఆడించడం ద్వారా భూపతి తొలి సీజన్ ను ఘనంగా నిర్వహించాడు. ఆసియాలోని టెన్నిస్ ప్రేమికులను ఈ లీగ్ బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో సీజన్ డిసెంబర్ 2న ఆరంభం కానుంది. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహేశ్ భూపతి మీడియాతో మాట్లాడుతూ... క్రికెట్లో టి20 ఫార్మాట్ ఎలాంటిదో, టెన్నిస్ క్రీడలో ఐపీటీఎల్ అలాంటిదేనని తెలిపారు. ప్రేక్షకులను రంజింపజేసే అన్ని హంగులు ఇందులో ఉన్నాయని అన్నారు. తక్కువ సమయంలో ఫ్యాన్స్ కు మజా అందిస్తుందన్నారు. మ్యాచ్ కాన్సెప్ట్ ను అభివృద్ధి చేశామని, ప్రపంచవ్యాప్తంగా లీగ్ ప్రజాదరణ పొందిందని వివరించారు.

More Telugu News