: ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదు... ఇక ప్యాకేజీ కోసం పోరాడాలి: జేపీ

ఇటీవల కేంద్ర ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదని స్పష్టమవడంతో ఇక ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడాలని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. దేశంలోని పలు రాష్ట్రాల డిమాండ్ల నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదన్నారు. కొంతమంది నేతలు వారి స్వార్థం కోసం ఉద్యమాలు, ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ కోసం ఐక్యంగా పోరాడాలని జేపీ సూచించారు.

More Telugu News