: కలాం పేరిట పేదలకు రూ.కోటి సాయం... సినీ నటుడు లారెన్స్ ప్రకటన

దక్షిణాది సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ నిన్న ఓ భారీ ప్రకటన చేశారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరిట పేదలకు కోటి రూపాయలను సాయంగా ఆయన ప్రకటించారు. అంతేకాక కలాం పేరిట ప్రత్యేకంగా పురస్కారాలు అందించనున్నట్లు వెల్లడించారు. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పేరిట కొత్తగా చిత్ర నిర్మాణ సంస్థను లారెన్స్ ప్రారంభించారు. దీని ఆధ్వర్యంలో స్వీయ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రధారిగా రెండు చిత్రాలను ప్రారంభించనున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఈ రెండు సినిమాల్లో ఒకటైన ‘మొట్టశివ కెట్టశివ’ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన వేందర్ మూవీస్ నుంచి లారెన్స్ నిన్న రూ.కోటి చెక్కును అందుకున్నారు. ఈ మొత్తాన్ని కలాం పేరిట పేదలకు సాయంగా ఇవ్వనున్నట్లు ఆయన అక్కడికక్కడే ప్రకటించారు. వంద మంది నిజాయతీ కలిగిన యువతీయువకులను ఎంపిక చేసుకుని ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందజేసి, నిజంగా అవసరమున్న వారిని ఆదుకుంటానని ఆయన ప్రకటించారు.

More Telugu News