: పిల్లలకు పాలు పట్టే గదులు, పాల బ్యాంకులను ప్రారంభించిన జయ
ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రత్యేక సదుపాయాలను ప్రారంభించారు. బస్టాండ్ లు తదితర పబ్లిక్ ప్రాంతాల్లో తల్లులు తమ బిడ్డలకు పాలు ఇవ్వడానికి 352 ప్రత్యేక గదులను ప్రారంభించారు. తమ పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో తల్లులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఈ గదులను ఏర్పాటు చేశారు. అదే విధంగా తల్లిపాల బ్యాంకులను కూడా ఆరంభించారు. మధురై, తిరుచిరాపల్లి తదితర ఏడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ బ్యాంకులను ఏర్పాటు చేశారు.