: వీడేం ఐఏఎస్ అవుతాడు... విద్యార్థి దశలో ఐవైఆర్ కృష్ణారావుపై ఆయన తండ్రి వ్యాఖ్య

సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందిన ఆయన, విద్యార్థి దశలో తన తండ్రికి మాత్రం అంత 'విషయం' వున్న కుర్రాడిలా కనిపించలేదట. కృష్ణారావు ఆంగ్లంలో రాసిన లేఖను చూసిన ఆయన తండ్రి ‘వీడేం ఐఏఎస్ అవుతాడు?’’ అని కూడా వ్యాఖ్యానించారట. ప్రకాశం జిల్లాకు చెందిన కృష్ణారావు కర్నూలులో 1972లో ఏర్పాటైన సిల్వర్ జూబ్లీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ కళాశాలలో ఆయనదే తొలి బ్యాచ్. నాటి తొలి బ్యాచ్ విద్యార్థుల్లో కొందరు ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తుండగా, మరికొందరు పదవీ విమరణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరంతా నిన్న హైదరాబాదులో 'పూర్వ విద్యార్థుల సమ్మేళనం' పేరిట ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన కృష్ణారావు, నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే గడిపారు. అలనాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తన తండ్రి తన సామర్థ్యంపై చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేసుకుని నవ్వుకున్నారట.

More Telugu News