: కేంద్రం నిర్ణయం తిరోగామి చర్యే... బూతు సైట్ల నిషేధంపై వర్మ ట్వీట్!

బూతు సైట్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తిరోగామి చర్యేనని బాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. లైంగిక నేరాలను తగ్గించేందుకు బూతు సైట్ల నిషేధం సరికాదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నిన్న ఆయన కేంద్రం నిర్ణయంపై నిరసన ప్రకటిస్తూ ట్విట్టర్ లో కాస్త ఘాటుగానే స్పందించారు. ‘‘దేన్నయినా నిషేధిస్తే, అది తెరవెనుక బలం పుంజుకుంటుంది. ఇది చరిత్రలో చాలాసార్లు నిరూపితమైంది. వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం ఏ రూపంలోనైనా హరిస్తే, అది ఆ దేశ సామాజిక పురోగతిని తిరోగమించేలా చేస్తుంది. అశ్లీల చిత్రాలు లైంగిక నేరాలను పెంచవని, పైగా లైంగిక నిగ్రహానికి అది ఒక సురక్షిత మార్గమని పలు అంతర్జాతీయ సర్వేల్లో నిరూపితమైన సత్యం’’ అని ఆయన తన ట్వీట్లలో స్పందించారు. పోర్న్ సైట్లపై నిషేధం విధించడం కన్నా, ఆ కంటెంట్ తప్పుడు మార్గంలో వెళ్లకుండా చూడటం బెటరని వర్మ అభిప్రాయపడ్డారు.

More Telugu News