: పండగల పేరు చెప్పి పాలన వదిలేసిన కేసీఆర్: ధ్వజమెత్తిన గుత్తా
పండగల పేరు చెబుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను పక్కదారి పట్టించారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విషయంలోనూ ముందస్తు ప్రణాళికలు లేవని దుమ్మెత్తి పోశారు. పాలనను గాలికొదిలేసిన ప్రభుత్వం, ఉన్న నిధులను కూడా ఖర్చు చేయలేకపోతోందని అన్నారు. మొన్నటికిమొన్న సచివాలయాన్ని కూల్చేస్తానని, ఇప్పుడు ఉస్మానియాను కూలుస్తామని చెబుతున్న కేసీఆర్ ఆటలిక సాగవని మండిపడ్డారు. మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు.