: చంద్రబాబూ! నీకేది కావాలో తేల్చుకో: సీపీఐ రామకృష్ణ
బీజేపీతో బంధుత్వం కావాలో, లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావాలో తేల్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తేల్చిచెప్పారు. విజయనగరం జిల్లా తగరపువలసలో ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడుకు 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల కంటే రెండు కేంద్ర మంత్రి పదవులే ఎక్కువయ్యాయని అన్నారు. కేవలం స్వార్థప్రయోజనాల కోసమే చంద్రబాబు బీజేపీతో అంటకాగుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచే ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం పోరాడకపోతే టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు.