: ఆప్ఘన్ తాలిబన్ నేత ముల్లా ఒమర్ చనిపోవడం నిజమే: వైట్ హౌస్

తాలిబన్ నేత ముల్లా మహ్మద్ ఒమర్ చనిపోయాడంటూ నాలుగు రోజుల కిందట ఆప్ఘన్ ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఈరోజు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా ధ్రువీకరించింది. ఒమర్ చనిపోయింది నిజమేనని వైట్ హౌస్ మీడియా అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ తెలియజేశారు. ఇక నుంచి ఆఫ్ఘనిస్తాన్ సురక్షితంగా ఉంటుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇదిలాఉంటే, ఒమర్ స్థానంలో తాలిబన్ గ్రూప్ కొత్త నేతగా అతని సన్నిహితుడు ముల్లా అక్తర్ మన్సోర్ ను నియమించిన విషయం తెలిసిందే.

More Telugu News