: మనవాడే... మనోళ్లను 'ఏ' రీతిలో అవుట్ చేశాడో చూడండి!


చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన రెండో అనధికార క్రికెట్ టెస్టులో ఆస్ట్రేలియా-ఎ జట్టు 10 వికెట్ల తేడాతో ఇండియా-ఎ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఆసీస్ విజయంలో మనవాడి పాత్ర చాలా ఉంది. భారత సంతతి బౌలరైన గురిందర్ సంధూ ఇండియా-ఎ జట్టును రెండు ఇన్నింగ్స్ లలోనూ దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్ లో 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఈ యువ పేసర్, రెండో ఇన్నింగ్స్ లో 76 పరుగులకు 4 వికెట్లతో సత్తా చాటాడు. టెయిలెండర్లను క్రీజులో కుదురుకోనీయకుండా పెవిలియన్ చేర్చాడు. ఓవరాల్ గా ఈ టెస్టులో 7 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మెక్ గ్రాత్, బ్రెట్ లీ వంటి పేస్ దిగ్గజాలు సంధూ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఆసీస్ జాతీయ జట్టుకు ఆశాకిరణమని పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News