: ‘ప్రైవేట్’ ఫీజులు తగ్గించాలన్న డిమాండుతో ఒంటికి నిప్పంటించుకున్న బీసీ సంఘం నేత
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దందాపై నిరసనలు ఎగసిపడుతున్నాయి. ఎక్కడికక్కడ ఆయా ప్రైవేట్ పాఠశాలల ముందు విద్యార్థి సంఘాలతో పాటు ప్రజా సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ పాఠశాల ముందు కొద్దిసేపటి క్రితం బీసీ సంఘం ధర్నాకు దిగింది. ధర్నాలో పాల్గొన్న బీసీ సంఘం నేత సిరిబాబు ఉన్నట్టుండి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన సంఘం నేతలు మంటలార్పి అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో సిరిబాబుకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.