: తండ్రి కాబోతున్న ఫేస్ బుక్ చీఫ్
ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ ఎట్టకేలకు తండ్రి కాబోతున్నారు. 2012లోనే ప్రిస్కిల్లా చాన్ ను జుకెర్ బర్గ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పిల్లల కోసం ఈ జంట దాదాపు మూడేళ్ల పాటు తహతహలాడింది. ఇప్పటికే మూడు సార్లు గర్భం దాల్చిన చాన్, అబార్షన్ కారణంగా పిల్లలకు జన్మనివ్వలేకపోయింది. అయితే ఈసారి ఆ ప్రమాదం లేదని జుకెర్ బర్గ్ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన నిన్న ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. చిన్నారి పాపకు తన భార్య చాన్ జన్మనివ్వనుందని కూడా జుకెర్ బర్గ్ ప్రకటించారు.