: మరో ‘ఎర్ర’ స్మగ్లర్ అరెస్ట్... దుబాయి పారిపోతుండగా ముంబై ఎయిర్ పోర్టులో పట్టివేత


ఎర్రచందనం అక్రమ రవాణాపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ తో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన పలువురు నేరగాళ్లకు వరుసగా అరదండాలేస్తున్నారు. నిన్న రాత్రి ముంబై మీదుగా దుబాయి పారిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ అజారుద్దీన్ ను పోలీసులు చాకచక్యంగా పట్టేశారు. మరో స్మగ్లర్ వెంకటేశ్ ఇచ్చిన కీలక సమాచారంతో హుటాహుటిన ముంబై ఎయిర్ పోర్టు చేరుకున్న పోలీసులు, విమానమెక్కేందుకు సిద్ధంగా ఉన్న అజారుద్దీన్ ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News