: బల్జీత్ సింగ్ కుమారుడికి డీఎస్పీ ఉద్యోగం: పంజాబ్ ప్రభుత్వం


గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ లో దాక్కున్న ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన దివంగత ఎస్పీ బల్జీత్ సింగ్ కుమారుడికి డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. బల్జీత్ సింగ్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియాలో భాగంగా 25 లక్షల రూపాయలు కూడా ఇవ్వనున్నట్టు పంజాబ్ సీఎం ప్రకటించారు. అలాగే ఉగ్రదాడిలో మృతి చెందిన ముగ్గురు హోం గార్డుల కుటుంబాల్లోని వ్యక్తులకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ తెలిపారు. సివిల్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బస్సుపై కాల్పులు జరుపుతున్నా వెరవకుండా చాకచక్యంగా, ధైర్యంగా నడిపిన డ్రైవర్ నానక్ చంద్ ను స్వాతంత్ర్య దినోత్సవం రోజున 2 లక్షల రూపాయలతో సత్కరించనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News