: మోదీపై నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో పోరాడుతున్న టాలీవుడ్ నటుడు శివాజీ స్వరం పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ గుజరాత్ తెలివితేటలు ఏపీపై ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మోదీకి ఏపీ ప్రజల ఉసురు తగలడం ఖాయమని శాపనార్థాలు పెట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఊరుకోబోమని కేంద్రానికి తెగేసి చెప్పారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోవడంతో చంద్రబాబు, కేసులకు భయపడి జగన్ కేంద్రాన్ని ఈ విషయంలో గట్టిగా అడగలేకపోతున్నారని శివాజీ విమర్శించారు. అటు, ఏపీ ఎంపీలను కూడా ఆయన వదల్లేదు. వారు సిగ్గులేని దద్దమ్మలని పేర్కొన్నారు.

More Telugu News