: రిషితేశ్వరి కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఈ నెల 16న అరెస్టయిన ముగ్గురు నిందితులకు విజయవాడ కోర్టు రిమాండ్ పొడిగించింది. 14 రోజుల పాటు అంటే ఆగస్టు 14 వరకు వారి రిమాండును పొడిగిస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు ఈ కేసులో నాగార్జున వర్సిటీలో నేడు మూడవరోజు విచారణ జరుగుతోంది.