: 'యోగా డే' చాపలకు 92.50 లక్షలు... వేడుకలకు 32 కోట్లు
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఎన్డీయే ప్రభుత్వం ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల నిర్వహణకు 32 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో యోగా చాపలకోసం 92.50 (పన్నులు అదనం) లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు రాజ్యసభకు ఆయుష్ శాఖ వెల్లడించింది. మొత్తం 37 వేల యోగా చాపలను కొనుగోలు చేసినట్టు సదరు శాఖ పేర్కొంది. మెస్సర్స్ ఆర్క్ కాన్సప్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చాపలను సరఫరా చేసినట్టు ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు.