: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతోనే మాకు పోటీ: బీజేపీ
జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు కార్యాచరణపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, ఆగస్ట్ మొదటి వారం నుంచి ప్రజాక్షేత్రంలోకి దిగుతున్నామని చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాటానికి వ్యూహాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఎంఐఎంతోనే పోటీ అని చెప్పారు. అయితే, ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పారు. ఈరోజు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ అయింది. సమావేశం అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ పైవివరాలను వెల్లడించారు.