: కడప జిల్లాలో తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు అరెస్టు

కడప జిల్లాలో భారీ స్థాయిలో అక్రమరవాణా అవుతున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని దాసరపల్లి రిజర్వాయర్ వద్ద ఈరోజు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఎర్రచందనం రవాణా చేస్తున్న తమిళనాడుకు చెందిన 19 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6.5 కోట్ల విలువైన 114 ఎర్రచందనం దుంగలు, ఐదు గొడ్డళ్లు, మినీ లారీ స్వాధీనం చేసుకుని, వీరిపై కేసు నమోదు చేశారు.

More Telugu News