: ప్రణబ్ ముఖర్జీ హయాంలో స్పీడ్ అందుకున్న టెర్రరిస్టుల ఉరితీతలు... మూడేళ్లలో ముగ్గురికి ఉరి

మన దేశంలో టెర్రరిస్టుల ఉరితీతలు స్పీడ్ అందుకున్నాయి. గత మూడేళ్లలో ఏకంగా ముగ్గురు ఉగ్రవాదులను చకచకా ఉరితీసేశారు. 2012 జులై 25న భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత... ఉగ్రవాదులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లను వరుసగా తిరస్కరిస్తూ వచ్చారు. దీంతో, వీరికి ఉరిశిక్షలు అమలయ్యాయి. 2008 ముంబై మారణకాండలో సామాన్యులను ఊచకోత కోసి, సజీవంగా పట్టుబడిన కరుడుగట్టిన పాక్ ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ ను తొలుత ఉరి తీశారు. 2012 నవంబర్ 12న పూణేలోని ఎరవాడ జైల్లో కసబ్ ను ఉరితీశారు. ఆ తర్వాత, పార్లమెంటుపై దాడి చేసిన కేసులో మరో ఉగ్రవాది అఫ్జల్ గురును 2013 ఫిబ్రవరి 9న తీహార్ జైల్లో ఉరికంబం ఎక్కించారు. తాజాగా, ఈ ఉదయం 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ ను నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరితీశారు.

More Telugu News