: ‘రిషికేశ్వరి’ విచారణపై విద్యార్థుల అసంతృప్తి... ‘నాగార్జున’లో ఉద్రిక్తత

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటిలో నేటి ఉదయం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్యపై నలుగురు సభ్యుల కమిటీ జరుపుతున్న విచారణపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బహిరంగ విచారణ అంటూనే, వర్సిటీలోకి ఎవరినీ అనుమతించకుండా విచారణ చేపడుతున్నారంటూ విద్యార్థి జేఏసీ ఆందోళనకు దిగింది. వర్సిటీకి సెలవులు ప్రకటించి విచారణ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన విచారణ కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విచారణను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. విచారణలో అందరి అభిప్రాయాలను సేకరిస్తామని ఆయన పేర్కొన్నారు.

More Telugu News