: యాకుబ్ చనిపోయాడు... నిర్ధారించిన వైద్యులు
ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ చనిపోయాడు. ఈ మేరకు ఉరి శిక్ష అనంతరం అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 257 మంది మృతికి కారణమైన ముంబై బాంబు పేలుళ్లలో యాకుబ్ కు ప్రమేయముందన్న టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో టాడా కోర్టు డెత్ వారెంట్ మేరకు నేటి ఉదయం యాకుబ్ మెమన్ కు నాగ్ పూర్ జైలు అధికారులు ఉరి శిక్షను అమలు చేశారు. అనంతరం అతడి దేహాన్ని పరిశీలించిన వైద్యులు, యాకుబ్ చనిపోయినట్లు నిర్ధారించారు.