: అసెంబ్లీలో వైఎస్ఆర్ చిత్రపటాన్ని తొలగించమని నేను చెప్పలేదు: స్పీకర్ కోడెల

ఏపీ అసెంబ్లీలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని తొలగించమని తాను చెప్పలేదని స్పీకర్ కోడెల శివప్రసాద్ వెల్లడించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రుల చిత్ర పటాలు తొలగించాలా? లేదా? అనే అంశంపై నియమనిబంధనలేవి లేవన్నారు. అయితే వైఎస్ చిత్రపటం తొలగింపుపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదని తెలిపారు. తాను సంప్రదాయం ప్రకారమే విధులు నిర్వర్తిస్తున్నానని ఓ తెలుగు చానల్ తో కోడెల పేర్కొన్నారు.

More Telugu News