: ఆగస్టు 15 వేడుకలు గోల్కొండ కోటలో నిర్వహించనున్న టి.ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకలు గోల్కొండ కోటలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం టి.ప్రభుత్వం ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో గోల్కొండ కోటను పలువురు పోలీస్ ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీ సుదీప్ లక్టాకియా నేతృత్వంలోని బెటాలియన్ కోటలోని రాణీమహల్ ప్రాంతంలో జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్న ప్రాంతం, గోల్కొండ ప్రధాన ద్వారం పక్కనున్న మైదానంలో గౌరవం వందనం స్వీకరించే ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆగస్టు 15 వేడుకలు తొలిసారి ఇక్కడే జరిగిన సంగతి తెలిసిందే.

More Telugu News