: ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు ఉంది... ఆయన వెంటనే రాజీనామా చేయాలి: జేడీ శీలం డిమాండ్
ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు కూడా వుందని, అందువల్ల ముఖ్యమంత్రి పదవికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం డిమాండ్ చేశారు. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని కూడా ఇంతవరకు చంద్రబాబు చెప్పలేదని ఆయన అన్నారు. అదేవిధంగా, రూ. 50 లక్షలు ఇచ్చింది రేవంత్ రెడ్డి కాదని కూడా ఆయన అనలేదని గుర్తు చేశారు. కేవలం ఎదురు దాడిని తప్పించుకోవడానికే చంద్రబాబు ప్రయత్నించారని చెప్పారు. ఒక వేళ ఈ కేసులో నిర్దోషిగా చంద్రబాబు బయటపడితే, మళ్లీ సీఎం పదవి చేపట్టవచ్చని అన్నారు.