: మెమన్ క్షమాభిక్ష పిటిషన్ పై త్రిసభ్య ధర్మాసనంలో వాదనలు ప్రారంభం
ముంబయి వరుస పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనంలో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30న తనకు విధించనున్న ఉరిశిక్షపై స్టే ఇవ్వాలంటూ మెమన్ పెట్టుకున్న పిటిషన్ పై నిన్న(మంగళవారం) ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి. దాంతో విస్తృత ధర్మాసనానికి ఆ పిటిషన్ ను బదలాయించారు. అయితే మెమన్ ఉరిశిక్షపై స్టే ఇస్తారా? లేక కొట్టివేస్తారా? అనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.