: వైఎస్ చిత్రపటం తొలగింపు సరికాదు... కోడెలకు కేవీపీ లేఖాస్త్రం
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటం తొలగింపుపై ఆయన ఆత్మ బంధువు కేవీపీ రామచంద్రరావు గళం విప్పారు. ఉమ్మడి రాష్ట్రాల అసెంబ్లీ ఆవరణలోని వైఎస్ చిత్రపటాన్ని ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వైఎస్ ఆత్మ బంధువుగా పేరుపడ్డ ఆయన స్నేహితుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తప్పుబట్టారు. మరణించిన నేతల చిత్రపటాలను తొలగించడం సంప్రదాయం కాదని పేర్కొంటూ ఆయన అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు లేఖ రాశారు. తక్షణమే వైఎస్ చిత్రపటాన్ని తిరిగి అక్కడ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.