: మోదీకి ‘కోహినూర్’ ఇచ్చేయండి!... బ్రిటన్ కు భారత సంతతి ఎంపీ వినతి
భారత్ నుంచి తిరిగి వెళుతూ బ్రిటిష్ పాలకులు అత్యంత విలువైన వజ్రం ‘కోహినూర్’ను పట్టుకెళ్లిపోయారు. అప్పటి నుంచీ ఆ వజ్రం అక్కడే ఉండిపోయింది. కోహినూర్ ను వెనక్కు తీసుకొచ్చేందుకు భారతీయులు చేసిన ప్రయత్నాలు ఏ ఒక్కటి కూడా ఫలించలేదు. తాజాగా భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ కీత్ వేజ్ మరోమారు ఈ తరహా యత్నానికి శ్రీకారం చుట్టారు.
భారత్ కు చెందిన కోహినూర్ వజ్రాన్ని ఆ దేశానికే ఇచ్చేయండని కీత్ వేజ్ బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది నవంబర్ లో బ్రిటన్ రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి కోహినూర్ ను ఇచ్చి పంపండని ఆయన కోరారు. మరి ఆయన అభ్యర్థనకు బ్రిటన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.