: కలాం బంధువులతో రామనాథపురం కలెక్టర్ భేటీ...రామేశ్వరంలో అంత్యక్రియల ఏర్పాట్లు ప్రారంభం
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతిక కాయానికి రేపు మధ్యాహ్నం ఆయన సొంతూరు రామేశ్వరంలో అంత్యక్రియలు జరగనున్నాయి. నేటి ఉదయం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రామనాథపురం జిల్లా కలెక్టర్ కొద్దిసేపటి క్రితం రామేశ్వరానికి వెళ్లి కలాం బంధువులతో భేటీ అయ్యారు. కలాం అంత్యక్రియలకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులతో కలెక్టర్ చర్చిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో రామేశ్వరంలో కలాం అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.