: పంజాబ్ లో ముగిసిన ఎన్ కౌంటర్... ముగ్గురు తీవ్రవాదుల హతం

పంజాబ్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్ కౌంటర్ ముగిసింది. గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున మొదలైన ఎన్ కౌంటర్ సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. దీనానగర్ పోలీస్ స్టేషన్ లోకి చొరబడి పోలీసులతో పాటు పలువురు సామాన్యులను పొట్టన బెట్టుకున్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమామార్చారు. ఈ ఎన్ కౌంటర్ లో పంజాబ్ పోలీస్ కమాండోలు, ఎన్ఎస్జీ బలగాలు, కేంద్రం పంపిన ప్రత్యేక బలగాలు కూడా పాల్గొన్నాయి. దాదాపు పది గంటలకుపైగా ఎదురు కాల్పులు సాగాయి. ఉగ్రవాదుల దాడిలో ఎస్పీ బల్జీత్ సింగ్ సహా 13 మంది చనిపోయారు. దాడికి పాల్పడింది లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులని అనుమానిస్తున్నారు. మరికాసేపట్లో ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయనుందని తెలుస్తోంది.

More Telugu News