: గుర్ దాస్ పూర్ ఘటనపై రేపు ప్రకటన చేస్తా: రాజ్ నాథ్ సింగ్

పంజాబ్ లోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ లో జరిగిన ఉగ్రదాడిపై రేపు పార్లమెంటులో ప్రకటన చేస్తానని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. స్నేహ సంబంధాలు కోరుకునేటప్పుడు గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వాలదని ఆయన తెలిపారు. పంజాబ్ లో జరుగుతున్న ఉగ్రదాడిని రాజ్ నాథ్ సింగ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

More Telugu News