: ‘అగ్రిగోల్డ్’పై సీబీఐ విచారణ కోరుతూ పిల్... ఏపీ, తెలంగాణ, కేంద్రానికి హైకోర్టు నోటీసులు
లక్షలాది మంది మధ్యతరగతి ప్రజలను నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ మోసంపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... దీనిపై స్పందన తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన అగ్రిగోల్డ్, అధిక వడ్డీలను ఆశచూపి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించిన సంగతి తెలిసిందే. అయితే మెచ్యూరిటీ తీరిన బాండ్లకు డబ్బును చెల్లించడంలో ఆ సంస్థ చేతులెత్తేసింది. సేకరించిన నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్న సంస్థ యాజమాన్యం డిపాజిట్ దారులను నిలువునా ముంచేసింది.