: డిగ్రీలో సెమిస్టర్ పరీక్షల విధానాన్ని విరమించుకోవాలి: ఏఐఎస్ఎఫ్

ఏపీలో డిగ్రీలో సెమిస్టర్ పరీక్షల విధానాన్ని అమలు చేయాలనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విధానాన్ని విరమించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని, దాంతో గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశముందన్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

More Telugu News