: బీచ్ లు, స్విమ్మింగ్ పూల్ లకు పరుగులు తీస్తున్న జపాన్, తైవాన్ ప్రజలు
భారత్ లో కొన్ని సమయాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కు పైనే నమోదవుతుంటాయి. భానుడి ఉగ్రరూపం కారణంగా అలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఆ సమయాల్లో ప్రజల ఇక్కట్లు చెప్పనలవి కాదు. అమితమైన వేడి నుంచి రక్షణ కోసం నానాపాట్లు పడతారు. అదే, జపాన్, తైవాన్ వంటి దేశాల విషయానికొస్తే అక్కడి ప్రజలు 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆ దేశాల్లో ప్రజలు ఎండవేడిమి భరించలేక స్విమ్మింగ్ పూల్ లు, సముద్ర తీరాలను ఆశ్రయిస్తున్నారట. ఆదివారం భానుడి తీవ్రతకు జడిసి ప్రజలు ఇళ్లను వీడి ఉపశమనం కోసం నీళ్ల బాట పట్టారు. జలకాలాటలతో సేదదీరుతూ ఎండ నుంచి రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు.